ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో కాకినాడ విద్యార్థిని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నేహాంజని అనే విద్యార్థిని చరిత్రలోనే మొట్టమొదటి సారి అన్ని సబ్జెక్ట్‌లలో 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించి రికార్డ్ సృష్టించింది. సదురు విద్యార్థిని కాకినాడలోని భాష్యం స్కూల్ విద్యార్థిని అని సమాచారం. మరోవైపు ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులతో సత్తా చాటింది. ఆమె ఎలమంచిలిలోని చైతన్య స్కూల్లో చదివినట్లు సమాచారం. పల్నాడు జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థినికి 598 మార్కులతో దుమ్మురేపింది. ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్లో చదివిన పావని చంద్రిక అనే విద్యార్థిని కేవలం 2 మార్కులు మాత్రమే కోల్పోయింది. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివి స్టేట్ ర్యాంక్ మార్కులు తెచ్చుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, తాజాగా విడుదలైన పది ఫలితాల్లో 81.14 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అందులో బాలురు 78.31 శాతం ఉండగా, బాలికలు 84.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. వారిలో 5,64,064 మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడియంకు చెందిన వారు ఉండగా.. తెలుగు మీడియం వారు 51,069 మంది విద్యార్థులు ఉన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos