ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి దిశగా పరుగులిడేలా .. కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే రియల్ ఎస్టేట్ ను పెంచడానికి,ఇళ్ల నిర్మాణం జోరందుకునేలా చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇళ్ల నిర్మాణ అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తోంది. ఐదు అంతస్తుల వరకూ ఇక పర్మిషన్లు అక్కర లేదని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి లేఔట్ అప్ లోడ్ చేసి.. రుసుము చెల్లిస్తే అనుమతులు ఇచ్చేవిధంగా ఏర్పాట్లు చేసింది.

ఏపీలో 123 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని చోట్ల ఇళ్ల నిర్మాణ వేగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో అనుమతులు సాధారణ ప్రజలకు కూడా పెద్ద తలనొప్పి. ఇప్పుడు అలాంటి సమస్యలను అధిగమించడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు ఇలాంటి పలు పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకోవడానికి అనుమతుల కోసం ప్రభుత్వ పరంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భవనం ప్లాన్ ను రూపొందించుకుని ఆన్ లైన్ లో అప్ లోడ్ చూసి రుసుము చెల్లిస్తే అనుమతి వచ్చేసినట్లే అనుకోవచ్చు. ఈ మార్పు రియల్ ఎస్టేట్ వర్గాలకూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా ఐదు అంతస్తులు అంటే అపార్టుమెంట్లు కూడా వస్తాయి. అంటే ఇప్పుడు అపార్టుమెంట్లు నిర్మించుకోవాలంటే అనుమతుల కోసం ఎదురుచూడాలి. టౌన్ ప్లానర్లు లంచాలు డిమాండ్ చేస్తారు.

అయితే ఇప్పుడు అలాంటి సమస్యలను అధిగమించడానికి మార్గం సుగమం అయింది. ఫీజులు కట్టాల్సి వస్తుందని బిల్డర్లు రెండు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని నాలుగు అంతస్తులు కట్టేస్తూ ఉంటారు. దాని వల్ల సమస్యలు వస్తూంటాయి. ఇప్పుడు ఆన్ లైన్ సదుపాయాన్ని వినియోగించుకుని మున్సిపాలిటీకీ కట్టాల్సిన ఫీజులు కట్టేస్తే చాలా వరకూ సమస్యలు రాకుండా భవనాలు సేల్ గా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos