ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఎ.శివారెడ్డి, సభ్యులు మంత్రిరావు వెంకటరత్నం, దామచర్ల శ్రీనివాసరావు, మేరువ వెంకటేశ్వర్లు, జజ్జవరవు కులదీప్ తాడేపల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. విజయవాడలోని రెరా కార్యాలయంలో రెండు రోజుల కిందట ఏపీ రెరా చైర్మన్ గా శివారెడ్డితో పాటు సభ్యులు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. వారు తాజాగా మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబు తో భేటీ అయి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీ రియల్ ఎస్టేట్ సంబంధించిన పలు అంశాలు సీఎం చంద్రబాబుతో చర్చించారు. భవన నిర్మాణ రంగానికి సంబంధించి కేవలం పర్యవేక్షణ మాత్రమే కాకుండా ఈ రంగం అభివృద్ధికి పనిచేస్తామని ఛైర్మన్ శివారెడ్డి.. సీఎం చంద్రబాబుకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos