ఉండవల్లిః వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు అందించే వివిధ రకాల కిట్లను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో ప్రభుత్వం అందించబోయే కిట్లను అధికారులు ప్రదర్శించారు. ఆయా కిట్లను పరిశీలించిన మంత్రి లోకేష్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 222 పీఎమ్ శ్రీ పాఠశాలలకు స్టెమ్ ల్యాబ్ కిట్లను అందించనున్నారు. ఒక్కో స్టెమ్ ల్యాబ్ కిట్ లో 335 ఐటెమ్స్ ఉండనున్నాయి. రీసెర్చ్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా వీటిని రూపొందించడం జరిగింది. విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం అంశాలలో ప్రాక్టికల్ నాలెడ్జ్, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఇది దోహదపడనున్నాయి. వీటితో పాటు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకెండరీ స్కూల్స్ కు అందించే  లైబ్రరీ బుక్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి రూపొందించిన జాదు పిటారా కిట్, ఎఫ్ఎల్ఎన్ ప్రింట్ రిచ్ మెటీరియల్స్, గ్రేడ్ 1,2 విద్యార్థుల కోసం రూపొందించిన ఎఫ్ఎల్ఎన్ హ్యాండ్ మేడ్ మెటీరియల్స్ ను పరిశీలించారు. సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న ఎమ్.మస్తాన్ రావు, విజయవాడ పటమట ఎంపీయూపీ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్న ఓ.నిహారిక గీసీన డ్రాయింగ్స్ ను సిబ్బంది మంత్రి లోకేష్ కు బహూకరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos