భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష రంగంలో తన స్థానాన్ని మరింత బలపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్పేస్ పాలసీ 4.0ను ప్రకటించింది, తద్వారా వచ్చే పదేళ్లలో రూ. 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాలసీ కింద లేపాక్షి మరియు తిరుపతి ప్రాంతాల్లో రెండు సమగ్ర స్పేస్ నగరాలను అభివృద్ధి చేయనున్నారు. ఇవి అంతరిక్ష పరిశోధనలో వినూత్నతకు, తయారీ కార్యకలాపాలకు కేంద్రాలుగా మారనున్నాయి. ఉద్యోగావకాశాల సృష్టి, అంతర్జాతీయ భాగస్వామ్యాలు మరియు జాతీయ అంతరిక్ష కార్యక్రమాలకు మద్దతు వంటి అంశాలపై దృష్టి పెట్టిన ఈ పాలసీ, ఆంధ్రప్రదేశ్‌ను భారత అంతరిక్ష రంగంలో కీలక హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముందడుగు వేసింది.

ఈ పాలసీ ప్రధానంగా అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ ఉత్పత్తి, లాంచ్ ప్యాడ్లు, స్పేస్ సిటీలు, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం వంటి అంశాల చుట్టూ తిరుగుతుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్ కేవలం ఐటీ, వ్యవసాయ రాష్ట్రంగా మాత్రమే కాకుండా, అంతరిక్ష రంగానికి గుండెచప్పుడు లాంటి కేంద్రంగా మారనుంది. ప్రత్యేకంగా శ్రీ సత్యసాయి జిల్లా మరియు తిరుపతి పరిసరాల్లో స్పేస్ సిటీలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ నగరాలు అంతరిక్ష పరిశోధన, తయారీ, శిక్షణ, లాంచింగ్, డిజైన్ వంటి అనేక విభాగాల కేంద్రంగా ఉండనున్నాయి. వీటితో పాటు ప్రైవేట్ సంస్థలు తమ పరిశ్రమలను ఏర్పరచేందుకు అవసరమైన మౌలిక వసతులు, భూములు, అనుమతులు ఒకే చోట నుంచి లభించేలా "AP Space City Corporation" అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ స్పేస్ పాలసీలో ప్రత్యేకంగా స్టార్టప్‌లు, యువశాస్త్రవేత్తల ప్రోత్సాహానికి పెద్దపీట వేస్తారు. మదర్స్‌కు, మహిళా శాస్త్రవేత్తలకు, ఎస్సీ/ఎస్టీ యువతకు అదనపు ప్రోత్సాహక ప్యాకేజీలు అందించనున్నట్లు తెలుస్తోంది. స్టార్టప్‌లు తమ ప్రయోగాలు, పేటెంట్లు సృష్టించుకునే అవకాశాలను ఈ పాలసీ విశాలంగా విస్తరిస్తుంది. అవసరమైనంతగా ఫండింగ్, మెంటరింగ్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ అవకాశాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. ఇంజినీరింగ్, స్పేస్ టెక్నాలజీ, డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో ఉన్నత విద్యార్థులకు స్పెషల్ శిక్షణా కేంద్రాలు, ఇంటర్న్‌షిప్ అవకాశాలు, ఇండస్ట్రీ కోర్సులు అందించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. ఈ పాలసీ వల్ల రాష్ట్ర విద్యార్థులకు ISRO, ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలలో పని చేసే అవకాశాలు పెరుగుతాయి.

ఇది కేవలం ప్రభుత్వ ప్రాజెక్టు కాదు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఇది ఒక ఖచ్చితమైన ఆహ్వానం. ప్రభుత్వం ఏకదాటిగా స్పేస్ రంగంలో రూ. 25,000 కోట్లు పైగా పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ప్రత్యక్షంగా సుమారు 5,000 ఉద్యోగాలు, పరోక్షంగా 30,000 వరకు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఈ పాలసీ అమలులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL), మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో కలిసి పనిచేయనున్నారు. టెక్నికల్ కమిటీల ఏర్పాటు ద్వారా భూముల కేటాయింపు, పరిశ్రమల ఏర్పాటులో తక్షణ సహాయాన్ని అందించేలా ఒక స్పష్టమైన వ్యవస్థ అమలు చేయనున్నారు. ఈ విధానంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి అంతరిక్ష విధానం కలిగిన రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తోంది. మౌలిక వసతులు, పెట్టుబడులు, మానవ వనరులు అన్నింటినీ సమన్వయపరిచి, "స్మార్ట్ స్పేస్ హబ్" గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే దీర్ఘకాలిక లక్ష్యంతో రూపొందిన ఈ పాలసీ, రాష్ట్ర యువతకు, పరిశోధకులకు, పెట్టుబడిదారులకు ఒక కొత్త గమ్యాన్ని అందించబోతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos