టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి పల్లా శ్రీనివాసును తప్పిస్తారా? కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందా? అయితే ఎవరికి అవకాశం ఇస్తారనే అంశాలపై పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. త్వరలో మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుత అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే అధ్యక్షుడిగా కొత్త నేత ఎవరు అనేది హాట్ టాపిక్. అయితే ఆది నుంచి టీడీపీ అధ్యక్ష పదవి అనేది బీసీ నేతలకు కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే మరోసారి బీసీ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్య ప్రసాద్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇద్దరూ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారే. వీరిలో ఒకరికి టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాయమని ప్రచారం నడుస్తోంది.

2014లో రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ,  ఏపీకి వేరువేరుగా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. అది కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేటాయిస్తూ వచ్చారు. చంద్రబాబు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండగా.. రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తూ వచ్చారు. 2014లో తొలిసారిగా తూర్పు కాపు నేత కళా వెంకట్రావుకు ఛాన్స్ ఇచ్చారు. తూర్పు కాపు అంటే బీసీ సామాజిక వర్గం కిందకి వస్తుంది. అటు తరువాత కింజరాపు అచ్చెనాయుడుకు అవకాశం ఇచ్చారు. ఆయన వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత. బీసీ వర్గానికి చెందిన వారు కావడంతో అప్పట్లో ఛాన్స్ దక్కింది. అటు తరువాత పల్లా శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చారు. ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. ఇలా బీసీలకు అవకాశం ఇచ్చారు.

అయితే తాజాగా కొల్లు రవీంద్ర కు కానీ.. అనగాని సత్యప్రసాద్ కు కానీ.. ఛాన్స్ ఉంటుందన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. రేపల్లె నుంచి మూడుసార్లు వరుసగా గెలిచారు అనగాని సత్యప్రసాద్. 2019లో సైతం గెలిచారు. ఎన్ని రకాల ప్రలోభాలు ఎదురైనా పార్టీలోనే కొనసాగారు. అందుకే మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఈసారి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొల్లు రవీంద్ర పేరు కూడా వినిపిస్తోంది. రెండుసార్లు ఆయన మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో తొలిసారిగా గెలిచిన కొల్లు రవీంద్రకు క్యాబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. 2024లో రెండోసారి గెలవగా మంత్రిగా అవకాశం కల్పించారు. ఆయనకు సైతం టిడిపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఛాన్స్ ఎవరికి దక్కుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos