ఏపీలో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన కూట‌మి ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత తొలిసారి ప్ర‌ధాని మోడీ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. విశాఖ వేదిక‌గా రేపు జ‌రిగే కార్య‌క్ర‌మాల‌లో ప్ర‌ధాని పాల్గొన‌నున్నారు. ప్రధానమంత్రి రెండు రోజుల పర్యటనలో భాగంగా రేపు, ఎల్లుండి అంటే 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో పర్యటించనున్నారు. సుస్థిరాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం.. దాదాపు రూ. 2 లక్షల కోట్లతో చేపట్టబోయే పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 8న అంటే రేపు సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి.

విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. హరిత ఇంధనం, సుస్థిర భవిష్యత్తు దిశగా అంకితభావంతో ఆయన వేసిన మరో ముందడుగు ఇది. జాతీయ గ్రీన్ హడ్రోజన్ మిషన్ లో భాగంగా ఇదే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్. ఈ ప్రాజెక్టు పెట్టుబడి దాదాపు రూ. 1,85,000 కోట్లు. 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాల్లో పెట్టుబడి ఇందులో భాగం. తద్వారా, రోజుకు 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇది దేశంలోని అతిపెద్ద సమీకృత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా మారింది.  అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో రూ. 19,500 కోట్ల విలువైన వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా పలు ఇతర ప్రాజెక్టులతోపాటు విశాఖపట్నంలో దక్షిణ తీర రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులు రద్దీని తగ్గించి, అనుసంధానాన్ని పెంచుతాయి. దానితోపాటు ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక వృద్ధినీ మెరుగుపరుస్తాయి.

కాగా ప్రధాని నరేంద్రమోదీ బుధవారం విశాఖపట్నంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని రోడ్ షో కోసం హోంమంత్రి వంగలపూడి అనిత వినియోగిస్తున్న ప్రచార రథం బాగుంటుందని నేతలు నిర్ణయించారు. దీంతో సరికొత్త హంగులతో సర్వాంగ సుందరంగా అనిత వినియోగించిన ప్రచార రథాన్ని ముస్తాబు చేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలతో అత్యంత ఆకర్షణీయంగా వాహనాన్ని డిజైన్ చేశారు. విశాఖలో రేపు వెంకటాద్రి వంటిల్లు నుంచి ఈ ప్రచార రథం నుంచే మోడీ రోడ్ షో లో ప్రజలకు అభివాదం చేయనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos