ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్యసేవా పథకం కింద.. యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీకి ఏపీ కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయంతో.. రాష్ట్రంలోని ప్రతీ పౌరునికి ఆరోగ్య బీమా కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా అందించనున్నారు. ఇక ఈ యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ ద్వారా రాష్ట్రంలోని ఒక్కో కుటుంబానికి ప్రతీ సంవత్సరానికి రూ.25 లక్షల వరకు ఫ్రీగా మెడికల్ ట్రీట్‌మెంట్ అందించనున్నారు.

మరోవైపు.. ట్రీట్‌మెంట్ కోసం వచ్చేవారికి వీలైనంత త్వరగా అప్రూవల్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. అప్లై చేసుకున్న 6 గంటల్లోనే ట్రీట్‌మెంట్‌కు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్‌మెంట్‌ కోసం చర్యలు చేపట్టారు. రూ.2.5 లక్షలలోపు ఉన్న ట్రీట్‌మెంట్‌లకు సంబంధించిన క్లెయిమ్‌లు.. ఇన్సూరెన్స్‌ కంపెనీల పరిధిలోకి వచ్చేలా సరికొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ఇక రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు అయ్యే వైద్య ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చెల్లించనుంది. ఇక ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.43 కోట్ల పేద కుటుంబాలతోపాటు.. 20 లక్షల మంది మధ్య తరగతి, ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలకు ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీని వర్తింపజేసేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.

ఇక.. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో ఆంధ్రప్రదేశ్‌లో 10 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం కల్పించింది. ఈ 10 కాలేజీలను ఒకే దశలో కాకుండా రెండు దశల్లో నిర్మించనున్నారు. మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె, పెనుగొండ, పాలకొల్లు, బాపట్ల, అమలాపురం, నర్సీపట్నం, పార్వతీపురంలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos