ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ను ఖరారు చేసారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు సమయం నుంచి పలువురి పేర్లు రేసులో ఉన్నాయి. రిటైర్డ్ డీజీపీల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే, ఎన్నికల సమయంలో పరీక్షల నిర్వహణ .. ఉద్యోగాల భర్తీ పైన ఇచ్చిన హామీలిచ్చారు. దీంతో. ఏపీపీఎస్సీ కీలకంగా మారుతోంది. ఈ సమయంలో అనేక చర్చల తరువాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అనురాధ ను చంద్రబాబు ఎంపిక చేశారు.

ఏపీ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్ మహిళా ఐపీఎస్ అనురాధను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తరువాత 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం లో అనురాధ ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమితులైన తొలి మహిళా అధికారిగా నిలిచారు. అయితే, ఆ తరువాత అనురాధ స్థానంలో ఏబీ వేంకటేశ్వర రావును చంద్రబాబు నిఘా చీఫ్ గా నియమించారు. అనురాధ ఏపీలో హోం శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో శాంతి భద్రతల అదపు డీజీగా వ్యవహరించారు.

ఐపీఎస్ అధికారిగా సమర్ధవంతంగా పని చేసిన అనురాధను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం చేసిన సిఫార్సుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌ అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారి. ఏపీపీఎస్సీ ఛైర్మన్ నియామకం సమయంలో ప్రభుత్వం పలువురి పేర్లను పరిశీలించింది. వైసీపీ హయాంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా పని చేసారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన తన పదవికి రాజీనామా చేసారు. ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ.. ఉద్యోగాల కల్పన పైన ఎన్నికల సమయంలో కూటమి నేతలు కీలక హామీలు ఇచ్చారు.

వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ పరీక్షలతో పాటుగా మూల్యాంకణం పైన ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏపీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు పరిశీలించారు. పూనం మాలకొండయ్య, కేరళలో పనిచేస్తున్న కె.శ్రీనివాస్, గతంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లో వైస్ చాన్సలర్ పనిచేసిన అప్పారావు, యలమంచిలి రామకృష్ణ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. చివరగా అనురాధను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఎంపిక చేసారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos