ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి స్పీకర్ పలు కమిటీలను ప్రకటించారు. అసెంబ్లీలో ఆర్థిక కమిటీలైన పీఏసీ, పీయూసీ, అంచనాల కమిటీలను జనవరి ఆఖరులో నియమించిన సంగతి తెలిసిందే.. తాజాగా ఆర్థికేతర కమిటీలను ప్రకటించారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఛైర్మన్‌గా రూల్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి.ధర్మరాజు, గద్దె రామ్మోహన్‌రావు, కిమిడి కళా వెంకట్రావు, సుజనా చౌదరి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలను నియమించారు.
అసెంబ్లీ ప్రివిలెజ్ కమిటీ ఛైర్మన్‌గా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పితాని సత్యనారాయణను నియమించారు. ఈ కమిటీలో బండారు సత్యానందరావు, బొగ్గుల దస్తగిరి, పి.ధర్మరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు, మామిడి గోవిందరావు సభ్యులుగా ఉన్నారు. అలాగే పిటిషన్ల కమిటీని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో గంటా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పల్లా శ్రీనివాసరావు, గురజాల జగన్‌మోహన్, పెన్మత్స విష్ణుకుమార్‌రాజు సభ్యులుగా ఉన్నారు.
ఎథిక్స్ కమిటీకి శాసనసభ మాజీ ఉప సభాపతి, ప్రస్తుత ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ను ఛైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో జ్యోతుల నెహ్రూ, కోట్ల జయసూర్య ప్రకాశ్‌రెడ్డి, బత్తుల బలరామకృష్ణ, భాష్యం ప్రవీణ్, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ముప్పిడి వెంకటేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ హామీల కమిటీకి మాజీ మంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఛైర్మన్‌గా నియమించారు. ఈ కమిటీలో దామచర్ల జనార్దనరావు, గిడ్డి సత్యనారాయణ, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి, కలిదిండి సూర్య నాగ సన్యాసిరాజు, అమిలినేని సురేంద్రబాబులు సభ్యులుగా ఉన్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos