ఏపీలో ఉద్యోగాల భర్తీ దిశగా కసరత్తు జరుగుతోంది. నోటిఫికేషన్ల జారీ దిశగా ఏపీపీఎస్సీ అడుగులు వేస్తోంది. త్వరలో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు వెల్లడించారు. వీటి ద్వారా దాదాపు 80 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఈ నెలాఖరుకే ఈ నోటిఫికేషన్లు జారీ అవుతాయని తెలిపారు. అటవీ శాఖలో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టులు 691, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు 100 భర్తీకి ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేశామని వివరించారు.

ఈ నెల 7న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో స్ర్కీనింగ్‌ పరీక్షలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 287 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్లపై వివరాలను పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని సూచించారు. ఒకసారి సమాధానం రాసి, దాన్ని వైట్‌నర్‌ లేదా ఇతర మార్గాల్లో చెరిపివేస్తే, ఆ పేపర్లను ఇన్‌ వాలిడ్‌గా పరిగణిస్తారని వెల్లడించారు. అదేవిధంగా ప్రతి మూడు తప్పులకు ఒక మైనస్‌ మార్కు ఉంటుందన్నారు. కాగా, స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల జాబితాలు శాప్‌ నుంచి రానందున గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల ఫలితాలు నిలిచిపోయాయని తెలిపారు. స్పోర్ట్స్‌ కోటా మినహా మిగిలిన పరీక్షల ఫలితాల ప్రక్రియ మొత్తం పూర్తయిందని రాజాబాబు చెప్పుకొచ్చారు.

అదేవిధంగా గ్రూప్‌-2లో 1634 మంది అభ్యర్థుల కంటిచూపు, 24 మంది అభ్యర్థుల వినికిడి రిపోర్టులు అందాల్సి ఉందన్నారు. గ్రూప్‌-1, 2 ఫలితాలపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మ వద్దని సూచించారు. కాగా, త్వరలో విడుదల చేసే నోటిఫికేషన్లలో తక్కువ పోస్టులు ఉండటంతో అన్నింటికీ కలిపి ఒకేసారి పరీక్షలు నిర్వహించేలా ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. అటు ఈ వారంలోనే డీఎస్సీ పోస్టుల భర్తీ దిశగా కసరత్తు కొనసాగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos