ఏపీ ప్రభుత్వం న్యూ ఇయర్ వేళ నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఏపీపీఎస్సీ ద్వారా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం కసురత్తు చేస్తోంది. జనవరి 12న ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్ల జారీ.. ఇప్పటికే విడుదల చేసిన 20 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా భర్తీ చేయబోయే ఉద్యోగులకు సంబంధించి 18 నోటిఫికేషన్లు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ జాబ్స్ అటవీ శాఖలోనే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పలు ఎయిడెడ్ స్కూల్ యాజమాన్యాలకు పాఠశాల విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. ఈ స్కూల్స్‌లో గత మూడేళ్లుగా విద్యార్థుల సంఖ్య 40 లోపే ఉంటోంది. గత ఏడాది 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లకు నోటీసులు ఇచ్చారు. కానీ విద్యార్థుల సంఖ్య పెరగకపోవడంతో చర్యలు తీసుకునేందుకు గత ఏడాది రెండో నోటీసు కూడా ఇచ్చారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరంలో 41 బడుల్లో 40 లోపు మంది విద్యార్థులు ఉండగా.. 15 పాఠశాలల్లో 20 లోపే ఉన్నారు. అందుకే నోటీసులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, హైస్కూల్ ప్లస్‌ల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కింద కిట్ అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కిట్‌లో పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ మాన్యువల్స్, నోట్ పుస్తకాలు, ప్రాక్టికల్ రికార్డులను అందిస్తారు. వచ్చే విద్యా సంవత్సరమైన 2025-2026లో అందించనున్నారు. దీనికి రూ.32.95 కోట్లు వ్యయం కానున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు త్వరలో శుభవార్త చెప్పబోతుందని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos