ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు దిశగా కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేస్తోంది చంద్రబాబు- పవన్ కల్యాణ్ సర్కార్. ఇప్పటికే మంత్రివర్గంలో కూడా చర్చించి ఈ పథకానికి ఆమోదం తెలిపారు.

ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ మరో గుడ్ న్యూస్‌ చెప్పింది. సీనియర్ సిటిజన్లకు ప్రయాణ ఛార్జీలో 25 శాతం రాయితీని కల్పించింది. ఈ మేరకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఓ ప్రకటన విడుదల చేశారు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలు కల్పించింది.

60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రయాణికులకు ఈ రాయితీ వర్తిస్తుంది. ప్రయాణ సమయంలో సీనియర్ సిటిజన్లు తమ వయస్సుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ ఐడీ, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, రేషన్ కార్డుల్లో ఏ ఒక్కదాన్నయినా చూపించవచ్చు.

ఏపీకి చెందిన ప్రయాణికులు మాత్రమే కాకుండా ఏ రాష్ట్రానికి చెందిన వాళ్లయినా సరే.. తమ వయస్సును నిర్ధారించే పత్రాలను చూపించి 25 శాతం రాయితీతో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. పల్లెవెలుగు మొదలుకుని ఏసీ స్లీపర్ బస్‌ల వరకూ అన్ని రకాల సర్వీసుల్లోనూ ఈ వెసలుబాటును అందుబాటులోకి తీసుకొచ్చారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.

ఆ ధృవీకరణ పత్రాలను ఫిజికల్‌గా లేదా డిజిటల్ రూపంలో అంటే.. మొబైల్ ఫోన్‌లో ఫొటో రూపంలో చూపించినా సరిపోతుంది. గతంలో ఈ పథకం అమలులో ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని 2020 మే 21వ తేదీన దీన్ని అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. అధికారులు ఇప్పుడు తాజాగా దీన్ని పునరుద్దరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos