ఏపీ బ్రాండ్ అరకు కాఫీ ఘుమఘుమలు ఇకపై పార్లమెంట్ లోనూ ఎంపీలకు ఆహ్లాదాన్ని పంచబోతున్నాయి. అరకు లోయలో పండే కాఫీ రుచిని పార్లమెంట్ లో ఎంపీలకు పరిచయం చేసేందుకు అవకాశం ఇవ్వాలన్న ఏపీ ఎంపీల వినతిని లోక్ సభ స్పీకర్ తాజాగా అనుమతించారు. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో ఇవాళ రెండు స్టాల్స్ ను ప్రారంభించారు. కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, పీయూష్ గోయల్ తో పాటు ఏపీకి చెందిన ఎంపీలు, రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇందులో లోక్‌సభ క్యాంటీన్‌లో అరకు స్టాల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. అలాగే రాజ్యసభ క్యాంటీన్‌లో అరకు కాఫీ స్టాల్ ను వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. అరకు లోయలోని కాఫీ సువాసన పార్లమెంట్ లో గుబాళించబోతోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. అలాగే సీఎం చంద్రబాబు కూడా పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో కాఫీ ప్రియులకు శుభవార్త! మీరు ఇప్పుడు ఆవరణలోనే తాజాగా తయారుచేసిన అరకు కాఫీ కప్పును ఆస్వాదించవచ్చని చంద్రబాబు తెలిపారు. 'మన్ కీ బాత్'లో అరకు కాఫీని ప్రోత్సహించినందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, ఈ స్టాల్‌ను ఏర్పాటు చేయడానికి దయతో అనుమతి ఇచ్చినందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మైలురాయిని నిజం చేసిన ప్రతి ఒక్కరికీ, అంకితభావంతో ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇది మనందరికీ, ముఖ్యంగా మన గిరిజన రైతులకు గర్వకారణం, వారి అంకితభావం మరియు కృషి అరకు కాఫీని జాతీయ స్థాయిలో అత్యున్నత స్థాయికి తీసుకువచ్చింది. మనం ప్రతి కప్పును ఆస్వాదిస్తున్నప్పుడు, వారి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని కూడా గుర్తుంచుకుందామని అన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos