ఉక్కు దిగ్గజ సంస్థ ఆర్సెలార్‌ మిట్టల్‌ జపాన్‌కు చెందిన నిప్పన్‌ స్టీల్స్‌ (ఏంఎ/ఎన్‌ఎస్‌) కంపెనీలు సంయుక్తంగా ఉమ్మడి విశాఖలోని అనకాపల్లి దగ్గర ఏర్పాటు చేయనున్న ఈ ఇంటిగ్రేటెడ్‌ స్టీలు ప్లాంట్‌(ఐఎస్‌పీ)కు సంబంధించి మొదటి దశలో పెట్టే రూ.70,000ల కోట్ల పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భారీ పెట్టుబడులను అమరావతి నుంచి కాకుండా అదే ప్రాంతం నుంచి ప్రకటించడం వల్ల ప్రాధాన్యత కల్పించినట్లవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించినట్లు తెలిసింది. రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా సీఎం శ్రీకాకుళం జిల్లాలో పలు సంక్షేమ కార్యక్రమాల్లో శుక్రవారం పాల్గొన్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. ఈరోజు చంద్రబాబు విశాఖ చేరుకుని అభివృద్ధి పనులపై సమీక్షించే అవకాశం ఉందని తెలిసింది.

ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి వచ్చే సంవత్సరం జనవరిలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. పరిశ్రమకు అవసరమైన భూముల కేటాయింపు విషయంపై సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి దగ్గర బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీ కోసం కేటాయించిన రెండు వేల ఎకరాల్లో కొంతభాగంతోపాటు విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ లో భాగంగా నక్కపల్లి పార్కు ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూములను ఉక్కు పరిశ్రమ కోసం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సుమారు ఐదు వేల ఎకరాలను కేటాయించనున్నట్లు తెలిసింది. ఐఎస్‌పీ మొదటి దశ పూర్తైతే సుమారు 20,000ల మందికి ఉపాధి లభించనుంది. అనుబంధ పరిశ్రమల ద్వారా భారీగా ఉపాధి లభిస్తుందని పరిశ్రమలశాఖ అధికారులు చెబుతున్నారు.

నిజానికి రాష్ట్రానికి ఆర్సెలార్‌ రావడం వెనుక సుదీర్ఘ కసరత్తు జరిగింది. తొలుత ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలార్‌ సంస్థ దాదాపు నిర్ణయం తీసుకుంది. అక్కడి సర్కార్​తో సంప్రదింపుల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఈ దశలో సంస్థ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టింది. సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో నేరుగా సమావేశమయ్యేలా చూసేందుకు పరిశ్రమలశాఖ, ఏపీఐఐసీ అధికారులతో కూడిన బృందం కీలకంగా వ్యవహరించింది. ప్రోత్సాహకాలపై సంస్థ ప్రతినిధులతో సుదీర్ఘంగా సర్కార్ చర్చించింది. నెల రోజుల వ్యవధిలోనే సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నేరుగా సమావేశమయ్యారు. రెండురోజులకోసారి సంస్థతో అధికారులు సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ప్రతిపాదించిన భూములను పరిగణనలోకి తీసుకుని ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆర్సెలార్‌ సంస్థ అంగీకరించినట్లు తెలిసింది. మొత్తానికి ఇంత కసరత్తు తరువాత ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ అంగీకారం తెలపడంతో ప్రభుత్వ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos