ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇవాళ శుక్రవారం  ఓ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. తన సొంత నియోజకవర్గం ఉండి పరిధిలో ఉన్న ఓ రామాలయానికి వెళ్లిన సందర్భంగా ఈ దాడి జరిగింది. రఘురామతో పాటు ఉన్న కూటమి నేతలకూ, స్థానికులకూ మధ్య జరిగిన వాగ్వాదం దాడుల వరకూ వెళ్లడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై పలువురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఉండి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఆకివీడు పట్ఠణం పెదపేట రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామను ఓ వర్గం అడ్డుకుంది. రామాలయానికి ఆయన వాహనాలు వెళ్లకుండా అడ్డుకోవడంతో రోడ్డుపైనే అవి నిలిచిపోయాయి. దీంతో రఘురామ కారు దిగి అక్కడికి వెళ్లారు. ఈ రామాలయం విషయంలో కొంతకాలంగా వివాదం నెలకొనడంతో రఘురామను స్దానికులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే వాగ్వాదం కాస్త దాడుల వరకూ వెళ్లడంతో రాడ్లు, మేకులతో కొందరు ఆయనపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

అయితే విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు, ఆయన అనుచరులు అక్కడి నుంచి రఘురామను పంపేశారు. అనంతరం రఘురామపై దాడిని అడ్డుకున్న కూటమి నేతలపై దాడి చేశారు. కూటమి నాయకులపై రాడ్లతో ఓ వర్గం నేతలు దాడి చేయడంతో వారు ఆస్పత్రి పాలయ్యారు. వీరిని అనంతరం ఆస్పత్రికి వెళ్లి రఘురామ పరామర్శించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఈ రామాలయం విషయంలో స్థానికులతో రఘురామ గొడవ పడుతున్నారు. ఇది కాస్త ముదిరి ఇవాళ దాడుల వరకూ వెళ్లింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos