తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడని నిరూపించుకున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు అయిన నారా దేవాన్ష్. 9 ఏళ్ల వయస్సులో అరుదైన రికార్డు సాధించి, దేవాన్ష్ ఔరా అనిపించుకున్నాడు. మనవడి విజయాన్ని తెలుసుకున్న తాతలు సీఎం చంద్రబాబు, ఎంఎల్ఏ బాలకృష్ణ, తండ్రి మంత్రి నారా లోకేష్ లు దేవాన్ష్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

దేవాన్ష్ చదరంగంలో ప్రపంచ రికార్డ్ సాధించారు. వేగంగా పావులు కదపడంలో నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 9 ఏళ్ల దేవాన్ష్ "వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ - 175 పజిల్స్" ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణను దేవాన్ష్ అందుకున్నాడు. దేవాన్ష్ ఘనత పట్ల నారా, నందమూరి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వంతో దేవాన్ష్‌ ఈ రికార్డును సాధించగలిగాడు. 

ఇదిలావుండగా ...దేవాన్ష్ ఇటీవల  మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. అతను 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1నిమిషం 43సెకన్లలో పూర్తి చేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను వేగవంతంగా సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా ,మన లక్ష్యాన్ని చేరుకోవచ్చని దేవాన్ష్ నిరూపించాడు. పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగివున్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతునకగా చెస్ ఛాంపియన్స్ అభివర్ణిస్తున్నారు..

పిన్నవయసులో తనయుడు దేవాన్ష్ సాధించిన విజయంపై తండ్రి లోకేష్ స్పందిస్తూ… దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. దేవాన్ష్‌ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించాడని తెలిపారు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుంచి ప్రేరణ పొందాడని వెల్లడించారు. ఈ ఈవెంట్ కోసం దేవాన్ష్ గత కొన్ని వారాలుగా రోజుకు 5-6 గంటల పాటు శిక్షణ పొందాడని లోకేశ్ వెల్లడించారు. "దేవాన్ష్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి" అని ఆయన కోచ్ కె. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. 175 సంక్లిష్టమైన పజిల్స్‌ని ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం దేవాన్ష్‌ సొంతమని తెలిపారు.

కాగా 9 ఏళ్ల వయస్సులో 3 ప్రపంచ రికార్డు నెలకొల్పే స్థాయికి దేవాన్ష్ చేరుకోవడం అభినందించదగ్గ విషయమని నెటిజన్స్, టీడీపీ లీడర్స్, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos