పిచ్చి కుక్కల్ని, ఊర పందుల్ని, కాటేసే పాముల్ని వన్య ప్రాణుల సంరక్షణ పేరిట అలా వదిలేస్తే ప్రమాదకరమని, పిచ్చి కుక్కల్ని తాళ్ళతో కట్టెయాలని, ఊరపందుల్ని ఊళ్ళ నుంచి తరిమేయాలని, బుసలు కొట్టే పాములను కోరలు పీకి బుట్టల్లో బంధించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఒక టివి చానెల్ లో యాంకర్ గా కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్లేషకులుగా కృష్ణంరాజు ప్రజా రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా వ్యాఖ్యలు చేయటం క్షమించరాని నేరమని, ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధానిపై ఇప్పటివరకు వైకాపా నాయకులు చేసిన అశుద్దపు ప్రచారాలకు ఇది పరాకాష్ట అన్నారు. పురాణాల్లో దేవతల రాజధాని అమరావతి అని, ఆంధ్రప్రదేశ్ లో రైతుల భాగస్వామ్యం కలిగిన ప్రజా రాజధాని కూడా అలాంటిదే అనే మాటలను సహించలేక, నోటి కొచ్చినట్లు దూషణలు చేయటం పాత్రికేయ వృత్తికే కళంకం అని తేల్చి చెప్పారు. ఒక ప్రాంతాన్ని వేశ్యల ప్రాంతంగా మాట్లాడటం పైశాచిక ఆనందానికి నిదర్శనం అన్నారు. రాజధాని పొడ గిట్టని ఇలాంటి వారికి లుకెట్ సైట్ ఆర్డర్లు ఇచ్చి రాష్ట్ర బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎక్కిరించిందన్న సామెతలా ఇలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వ పనితీరును సవాల్ చేస్తాయని అన్నారు. ఈమేరకు తాను స్వయంగా ఎస్సీ ఎస్టీ కమీషన్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి 24 గుంటల్లో చర్యలు తీసుకోవాలని బాలకోటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos