క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో కొత్తగా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ఎన్నారై దంపతులు సుద్నగుంట కళ్యాణి మరియు ప్రసాద్ 10 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు.క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించిన క్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ క్యాన్సర్ పై పరిశోధనలకు ఈ రీసెర్చ్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ప్రవాసాంద్రులు ఇచ్చిన సహాయంతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రానికి కళ్యాణి, ప్రసాద్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ గా నామకరణం చేసినట్టు పేర్కొన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ ఆశయంతో ఈ హాస్పిటల్స్ స్థాపించబడిందని, నటన ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన దైవం తన తండ్రి అని ఆయన కలల సాకారంగా ఈ ఆసుపత్రి రూపుదిద్దుకుందని బాలకృష్ణ తెలిపారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి అత్యుత్తమ వైద్య చికిత్సను అందించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

2000 సంవత్సరంలో 110 బెడ్ లతో ప్రారంభమైనటువంటి క్యాన్సర్ ఆస్పత్రి ప్రస్తుతం 650 బెడ్ ల సామర్థ్యంతో క్యాన్సర్ ఆస్పత్రిగా ఎదిగిందని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన రీసెర్చ్ సెంటర్ ను నిర్మించి క్యాన్సర్ చికిత్సలో కొత్త ఆవిష్కరణలను సాధించే లక్ష్యంతో ఆసుపత్రి బృందం పనిచేస్తున్నదని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. క్యాన్సర్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో చికిత్సతో పాటు పరిశోధనలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ముందడుగు వేస్తుందని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos