ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల పైన స్పష్టత వచ్చింది. కొత్త పార్టీ చీఫ్ దాదాపు ఖరారయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ అనేక చర్చల తరువాత ఏపీ పార్టీ అధ్యక్షుడిని ఖరారు చేసింది. ఏపీలో సామాజిక సమీకరణాలే ఓటు బ్యాంక్ ను నిర్దేశిస్తున్న క్రమంలో భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా బీజేపీ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మిషన్ 2029 లక్ష్యంగా కొత్త అధ్యక్షుడి ఎంపిక పైన కసరత్తు చేసింది. కాగా, చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా పార్టీ ఏపీ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు ఖరారు ఖాయంగా కనిపిస్తోంది.

మోదీ - షా ద్వయం ఏపీలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా అధ్యక్షుడి పైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.దాదాపు పది మంది వరకు ఆశావాహులు పార్టీ అధ్యక్షుడి పదవి కోసం పోటీలో ఉన్నారు. వారిలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థ సారథి, విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే, బీజేపీ నాయకత్వం మాత్రం భవిష్యత్ వ్యూహాలకు అనుగుణంగా ఎంపిక చేసింది.

బీసీ వర్గానికి బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత ఇస్తోంది. అయితే.. ఇప్పటికే రాయలసీమకు చెందిన బీసీ నేత సత్య కుమార్‌ ను మంత్రిని చేసారు. రెండు రాజ్యసభ సీట్లు కూడా బీసీ నాయకులైన ఆర్‌. కృష్ణయ్య, పాకా సత్యనారాయణలకే ఇచ్చారు.  కాగా, టీడీపీ - జనసేనతో పొత్తులో ఉన్న వేళ.. ఆ రెండు పార్టీలకు రెండు ప్రధాన సామాజిక వర్గాలు మద్దతుగా నిలుస్తున్నాయి. తెలంగాణలో గత ఎన్నికల సమయంలో బీజేపీ బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్లటం కలిసి వచ్చింది. ఏపీలోనూ బీసీ ఓటింగ్ కీలకంగా మారుతోంది. దీంతో.. బీజేపీ ముందస్తుగానే తమ వ్యూహాలను అమలు చేయటంలో భాగంగా బీసీ నేతకు పార్టీ పగ్గాలు  నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బీసీ వర్గం నుంచి ఇద్దరు నేతలు ప్రధానంగా పోటీలో నిలిచారు. కాగా, తొలి నుంచి పార్టీకి విధేయతతో పాటుగా మిత్రపక్షాలతో సమన్వయం చేసుకునే నేతకు పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. అందులో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతకు బాధ్యతలు అప్పగించటం ద్వారా రానున్న రోజుల్లో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు బాధ్యతలు అప్పగించటం ఖాయమైందని పార్టీ నేతల సమాచారం. పోటీ లేకుండా మాధవ్ నామినేషన్ దాఖలు.. అధికారికంగా ప్రకటన వరకు ఢిల్లీ నాయకత్వం ఇప్పటికే సూచనలు చేసినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఢిల్లీ కేంద్రంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా.. బీసీ వర్గానికే బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి ఖాయంగా కనిపిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos