ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు - తడ సమీపంలో వాయుగుండం తీరం దాటింది. దీంతో, కోస్తా.. సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో, అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాల పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్థితిని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు అధికారులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను ఇరిగేషన్ అధికారులు వివరించారు.

ఈ రోజు, రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. జిల్లాలోని వరికుంటపాడు మండలం, కనియంపాడులో పిల్లాపేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో, జిల్లా అధికారులతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసారు.

అటు ప్రకాశం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా వర్షం కొనసాగుతోంది. తిరుమలతో సహా చిత్తూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తులకు సమస్యలు లేకుండా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం ఈ రోజు వరకు మూసి వేసారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇరిగేషన్ అధికారులు భారీ వర్షాల కారణంగా పెరుగుతున్న నీటి ప్రవాహాల గురించి ఆరా తీస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos