ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన రాయవరం పులి  ఎపిసోడ్ ఎట్టకేలకు ముగిసింది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఒక పాడుబడిన పాత ఇంట్లో   బెంగాల్ టైగర్‌ను అటవీ శాఖ అధికారులు , పోలీసులు నిన్న శుక్రవారం రాత్రి అత్యంత చాకచక్యంగా బంధించారు. గత పదిహేను రోజులుగా ప్రత్తిపాడు, అనపర్తి, రామచంద్రాపురం పరిసరాలను వణికించిన ఈ పులి, చివరకు అధికారుల పకడ్బందీ ప్లాన్‌తో చిక్కింది. పాడుబడిన ఇంటి నుంచి గురక శబ్దాలు వస్తున్నట్లు గుర్తించిన అధికారులు, అది గాఢ నిద్రలో ఉండగానే ఆపరేషన్‌ను వేగవంతం చేశారు.

నిజానికి పులిని బోనులోకి రప్పించేందుకు అధికారులు వేసిన ఎర ఫలించకపోవడంతో, ప్లాన్-బి ని అమలులోకి తెచ్చారు. శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి లోపలికి వెళ్లడం ప్రాణసంకటమని భావించిన అధికారులు, ఇంటి పైకప్పు నుంచి రంధ్రం చేసి పులి కదలికలను నిశితంగా గమనించారు.  డ్రోన్ కెమెరాల సాయంతో పులి ఎక్కడ నక్కి ఉందో కచ్చితంగా గుర్తించారు. సమయం కోసం వేచి చూసిన షూటర్లు,  ఆ ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో మత్తు ఇంజక్షన్‌ను   గురి తప్పకుండా షూట్ చేశారు. మత్తు ఇంజక్షన్ తగలగానే కాసేపు గర్జించిన ఆ బెంగాల్ టైగర్, కొద్దిసేపటికే మత్తులోకి జారుకుంది. పులి పూర్తిగా స్పృహ కోల్పోయిందని నిర్ధారించుకున్న తర్వాత, అటవీ శాఖ సిబ్బంది,  పోలీసులు అత్యంత జాగ్రత్తగా లోపలికి ప్రవేశించి దానిని నెట్‌ సహాయంతో బంధించారు. అనంతరం సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలోకి తరలించారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో కూర్మాపురం గ్రామస్తులతో పాటు జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.

గతంలో కాకినాడ జిల్లాలో పులిని పట్టుకునేందుకు నెలల తరబడి కష్టపడాల్సి వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి అధికారులు అత్యంత వేగంగా స్పందించారు. 144 సెక్షన్ విధించి, నైట్ విజన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని అధికారులు తెలిపారు. పట్టుబడిన పులిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం జూ పార్కుకు లేదా సురక్షితమైన అటవీ ప్రాంతానికి తరలించనున్నారు. దీంతో గత రెండు వారాలుగా సాగుతున్న పులి భయం నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లయింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos