టీటీడీ పరకామణి చోరీ కేసుకు సంబంధించి వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. తిరుపతిలోని సిట్ కార్యాలయానికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను ఈ కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, "ఈ కేసుకు, నాకు... భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. దుష్టచతుష్టయం నన్ను ఈ కేసులో ఇరికించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది" అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు నారా లోకేశ్, వర్ల రామయ్య, పట్టాభి, టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు తనను విచారించాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. "ఆ ఒత్తిడి భరించలేకనే అధికారులు నన్ను విచారణకు పిలిచారు. అయినను పోయి రావలె హస్తినకు" అని అన్నారు. కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తోందంటూ మీడియాపై కూడా భూమన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "కూటమి ప్రభుత్వాన్ని మోసే పిచ్చి శునకాలు అక్షరాల విరోచనాలతో తమ పత్రికలను నింపేశాయి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన సిట్ అధికారుల విచారణకు వెళ్లారు. ప్రస్తుతం ఈ కేసులో భూమన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos