ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ మెగా డీఎస్సీ మెరిట్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ఏపీ విద్యాశాఖ సోమవారం ఉదయం విడుదల చేసింది. 16,347 ఉద్యోగాలకు సంబంధించి ప్రక్రియ పూర్తిచేసిన అధికారులు తుది జాబితా విడుదల చేశారు. జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో, అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ అందుబాటులో ఉంచారు. ఏపీ మెగా డీఎస్సీ తుది ఫలితాల విడుదలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. మరో వాగ్దానం నెరవేరిందన్నారు. 

ఏపీ డీఎస్పీ ఫలితాలు తుది జాబితా అధికారికంగా ఇవాళ సెప్టెంబర్ 15న ఉదయం 9:30 గంటలకు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్ http://apdsc.apcfss.inలో అభ్యర్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ మైలురాయి బాధ్యతతో పాటు మా పాలనలో పారదర్శకతకు నిదర్శనం. మన విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, AP మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను అభివృద్ధి పథంలో నడిపేందుకు మెగా డీఎస్సీ ద్వారా నియామకాలు జరగాలని భావించినట్లు నారా లోకేష్ పేర్కొన్నారు.

కొత్త టీచర్లకు స్వాగతం పలుకుతున్నామని, విద్యార్థుల భవిష్యత్తుకు వారు మార్గదర్శకత్వం వహించాలి. వారు ఈ గొప్ప ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు వారికి సైతం మార్గనిర్దేశం చేయాలని సీనియర్ టీచర్లకు నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నంలో డీఎస్సీలో పోస్టులు సాధించని వారు నిరుత్సాహపడవద్దని.. హామీ ఇచ్చినట్లుగా, DSC ప్రతి సంవత్సరం నిర్వహించి అవసరాలకు తగ్గట్లుగా టీచర్ పోస్టులకు భర్తీ చేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పుడు పోస్టులు రాని డీఎస్సీ అభ్యర్థులు మరింత దృఢ సంకల్పంతో సిద్ధంగా ఉండాలని.. మీ అవకాశం కోసం వేచి చూడాలని సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos