ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి దిల్లీ మీదుగా దావోస్ పర్యటనకు వెళ్లారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రమోషన్​తో రాష్ట్రానికి భారీ పెట్టుబడుల సాధనకు ఐదు రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. సీఎం వెంట ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్​, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్,   అధికారులు ఉన్నారు. ఇవాళ జ్యూరిచ్‌లో ఉన్న భారత రాయబారితో సీఎం చంద్రబాబు బృందం భేటీ కానుంది. హిల్టన్ హోటల్​లో 10 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. హోటల్ హయత్​లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహించనున్న భేటీలో తెలుగు పారిశ్రామిక వేత్తలతో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించనున్నారు. ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై సమావేశంలో చర్చించనున్నారు.

అక్కడ నుంచి 4 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి దావోస్ చేరుకోనున్న సీఎం బృందం తొలి రోజు రాత్రి పలువురు పారిశ్రామిక వేత్తలతో డిన్నర్ మీటింగ్​లో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్​తో సమావేశం కానున్నారు. రెండో రోజు సీఐఐ సెషన్​లో గ్రీన్ హైడ్రోజన్ అంశంపై చర్చిస్తారు. అదేవిధంగా సోలార్ ఇంపల్స్, కోకకోలా, వెల్​స్పన్, ఎల్​జీ, కార్ల్స్​బర్గ్, సిస్కో, వాల్​మార్ట్ ఇంటర్నేషనల్​, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈవోలతో, చైర్మన్​లతో చంద్రబాబు భేటీ అవుతారు.

యూఏఈ ఎకానమీ మినిస్టర్ అబ్దుల్లా బిన్​తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహిస్తున్న ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ అనే అంశంపై జరిగే చర్చలో ఆయన పాల్గొంటారు. ది నెక్ట్స్ వేవ్ పైనిరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమోరో చర్చా కార్యక్రమం సహా వివిధ జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మూడో రోజు పలు బిజినెస్ టైకూన్​లతో సీఎం సమావేశమవుతారు. రోజుకు కనీసం పదికిపైగా భేటీలు, సమావేశాలకు హాజరు కానున్నారు. నాలుగో రోజు చంద్రబాబు బృందం దావోస్ నుంచి జ్యూరిచ్‌ చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి రానున్నారు.  కాగా గతంలో చంద్రబాబు దావోస్ లో పర్యటించడం వల్ల పెట్టబుడులు బాగా వచ్చాయి. పెట్టుబడులు వచ్చినా రాకపోయినా ఏపీని .. పెట్టుబడిదారుల గుడ్ లుక్స్‌లో ఉంచడానికి వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాల గుర్తుల్ని మర్చిపోయేలా చేయడానికి చంద్రబాబు విస్తృతంగా ప్రయత్నించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి .. రెండోసారి సీఎం హోదాలో దావోస్ వెళ్తున్నారు. గత ఏడాది వెళ్లారు కానీ అప్పటికి పదవి చేపట్టి స్వల్ప సమయం కాబట్టి.. అంతకు ముందు చేసిన ప్లానింగ్ ను బట్టే ఆయన టూర్ సాగింది. కానీ ఆ సారి మాత్రం.. తన టీమ్ ముద్ర స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దావోస్ లో తెలంగాణకు ప్రత్యేక పెవిలియన్ తో పాటు ఫోర్త్ సిటీని ప్రమోట్ చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్, జగన్ రెడ్డి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు నేరుగా వెళ్తున్నారు. అదే తెలుగు రాష్ట్రాల పాలనలో వచ్చిన కీలక మార్పు అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos