వైసీపీ అగ్రనేతల్లో చాలా మంది పార్టీ మారిపోతున్నారని రెండు రోజులుగా సోషల్ మీడియాకు లీకులు వస్తున్నాయి. ఆ లీకులు వైసీపీ క్యాంపు నుంచే వస్తున్నాయి. అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్ తో పాటు ఆరుగురు మాజీ మంత్రులంటూ పుకార్లు వస్తున్నాయి. వీటికి కాస్త బలం వచ్చేలా ఆ మంత్రులెవరూ వైసీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. విచిత్రంగా జోగి రమేష్ తాను కోరుకున్నట్లుగా మళ్లీ మైలవరం ఇన్ చార్జ్ పదవి ఇచ్చినప్పటికీ ఆయన ఆ నియోజకవర్గం జోలికి వెళ్లడం లేదు.

రెడ్డి వర్గం నేతల ఈగో కోసం తన రాజకీయ జీవితాన్ని జగన్ రెడ్డి బలిపెట్టాడని అనిల్ కుమార్ యాదవ్ కు బాగా తెలుసు. కానీ ఆయనకు మరో దారి లేక జగన్ రెడ్డి అంటే ఒక ఇది.. ఒక అది అని కొన్నాళ్లు చెప్పారు. ఇప్పుడు ఆయనకూ తత్వం బోధపడిందని అంటున్నారు. పవన్ కల్యాణ్ కు వీరాభిమానిగా పేరున్న ఆయన … జగన్ రెడ్డి దగ్గర తన విధేయత నిరూపించుకోవడానికి చేయని వ్యాఖ్యలు లేవు. నోరు అదుపులో ఉండని అనిల్ కుమార్ కూడా ఇప్పుడు తన భవిష్యత్ కు పవన్ భరోసా ఇస్తారని ఆశ పడుతున్నారని చెబుతున్నారు.

మొత్తంగా ఆరుగురు మంత్రులు జనసేన, టీడీపీల్లో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారని చెబుతున్నారు. వారితో పాటు పదుల సంఖ్యలో ఇతర స్థాయి నేతలు కూడా అదే దారిలో ఉన్నారు. వీరిని ఆపేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవని అంటున్నారు. జగన్ రెడ్డికి బయటికి వెళ్ళిపోతున్న నాయకులతో మాట్లాడేంత తీరిక లేదని... ఆయనకు అంత సామర్థ్యం ఉంటే సొంత ఇంట్లో చిచ్చు పెట్టుకునే పరిస్థితే ఉండదని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. ఆ పార్టీలో మున్ముందు ఏం జరుగుతుందో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos