సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన విడుదలకు సంబంధించిన అన్ని నిబంధనలు ట్రయల్ కోర్టు ఇస్తుందని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించాలని.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వ్యాఖ్యానించింది. డిబేట్‌లో కొమ్మినేని నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని ప్రశ్నించింది.. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా తాము కూడా నవ్వుతుంటామని.. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేని శ్రీనివాసరావుకు సంబంధం లేదని అభిప్రాయపడింది. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలని.. భవిష్యత్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
అంతకుముందు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారని.. మూడేళ్లలోపు శిక్షపడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయని కొమ్మినేని తరఫు లాయర్ కోర్టుకు విన్నవించారు. నోటీసు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారని..సుప్రీంకోర్టు తీర్పును పోలీసులు పాటించలేదన్నారు. డిబేట్‌లో గెస్ట్ లు చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని.. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని గెస్ట్‌ను కొమ్మినేని నియంత్రించారని.. ఆయన ఆ వ్యాఖ్యల్ని సమర్థించలేదన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావును తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్‌లో రిమాండ్ చేశారన్నారు.
కొమ్మినేనిని ట్రాన్సిట్ రిమాండ్ కు తీసుకోలేదని.. ఆయన సీనియర్ జర్నలిస్టు, ఎలాంటి నేర చరిత్ర లేదని లాయర్ కోర్టుకు తెలిపారు. శ్రీనివాసరావు 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్.. దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదన్నారు. స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున లాయర్‌ను అనుమతించలేదని.. సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమన్నారు. ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించారని.. ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాక్ స్వాతంత్ర్యానికి భంగం కలిగిస్తున్నారని.. అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగిందన్నారు. ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం కొమ్మినేని విడుదలకు అనుమతించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos