ఏపీ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులకు భద్రతా బలగాలు గట్టి షాక్ ఇచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా కూడా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. మంగళవారం ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా దళాలు తారసపడ్డాయి. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నేతల్లో ఒకడైన మద్వి హిడ్మా ఉండటం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టంగా భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

మరోవైపు పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో కూడా మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం ఉదయం సుక్మా జిల్లాలోని ఎర్రబోరు ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లుగా జిల్లా  పోలీసు అధికారులు వెల్లడించారు. సరిహద్దుల్లో రెండు రాష్ట్రాల్లో ఏకకాలంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల ఘటనలు మావోయిస్టులకు పెను విఘాతాన్ని కలిగించాయి. కీలక నేత మృతిచెందడంతో దళాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos