మద్యం కేసు నుంచి బెయిల్ పై విడుదల అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సోదాలు చేపట్టారు. ఈ రోజు ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరుల్లో మిథున్ రెడ్డికి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం నాలుగు బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఆయా కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, ఇతర సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు గానీ దీన్ని ఎవరూ అధికారికంగా ధృవీకరించట్లేదు. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన అరెస్ట్ అయ్యారు కూడా. 71 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీ తర్వాత ఇటీవలే రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బెయిల్ పై విడుదల అయ్యారు. పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఆయన బెయిల్ పై విడుదల అయిన తర్వాత.. పార్టీ అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూ­రు జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ రీ అపాయింట్ అయ్యారు.

దీంతో ఆయా జిల్లాల నాయకులతో తిరుపతిలోని తన నివాసంలో తరచూ సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నారు. పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించారు. త్వరలో అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూ­రు జిల్లాల పార్టీ నాయకులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మూడు జిల్లాలకు చెందిన అధ్యక్షులు, అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల ఇన్ ఛార్జీలతో సమావేశం కానున్నారు. త్వరలో ఆయా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు ప్రాతినిథ్యాన్ని వహించే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఆయనకు చోటుh దక్కింది. త్వరలోనే ఆయన ఈ బృందంతో కలిసి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్ళనున్నారు. తెలుగుదేశం- జనసేన కూటమికి చెందిన ఎంపీలను కాదని కేంద్ర ప్రభుత్వం మిథున్ రెడ్డిని ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ పరిస్థితుల మధ్య మిథున్ రెడ్డి మరోసారి సిట్ రాడార్ లోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos