ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డ సొంత నియోజకవర్గాన్ని పొరుగు జిల్లాలో కలిపేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలో పుంగనూరు నియోజకవర్గం చేరిక దాదాపుగా పూర్తి అయినట్లే. రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల క్రితం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఒకవేళ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 
.. వాటిని స్వీకరించడానికి 30 రోజుల గడువు ఇవ్వగా.. అది పూర్తయ్యింది. అయితే రాయచోటి కలెక్టర్ కార్యాలయానికి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయానికి పులిచెర్ల మండలానికి సంబంధించి అభ్యంతరాలు వచ్చాయి.. ఈ ఒక్కటి మినహా అభ్యంతరాలు రాలేదు. ఈ అంశంపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని.. పుంగనూరు నియోజకవర్గం విలీన ప్రక్రియను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తోంది. అన్నమయ్య జిల్లాలో పుంగనూరు విలీనం అంశంపై అడ్డంకులు తొలగిపోయాయని భావిస్తున్నారు అధికారులు.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో ప్రస్తుతం ఉన్న పదకొండు మండలాలు, మరో ఐదు మండలాలు అన్నమయ్య జిల్లాకు బదిలీ అవుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం చిత్తూరులో జిల్లాలో ఉన్న పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్న పుంగనూరు, రొంపిచెర్ల, సోమల, చౌడేపల్లి, సదుం మండలాలు మదనపల్లె డివిజన్‌లోకి వెళతాయి. అలాగే నియోజకవర్గాల సంఖ్య ఏడుకు పెరుగుతుందని అంటున్నారు. అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం 30 మండలాలు ఉన్నాయి.. ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గం కూడా విలీనం అవుతుండటంతో.. జిల్లా విస్తీర్ణం పెరగడంతో పాటు మొత్తం మండలాల సంఖ్య 35కు చేరుతుందని అంటున్నారు. అలాగే రాజకీయంగా మార్పులు ఖాయం అంటున్నారు.

రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి పుంగనూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉన్న కారణంగా ఇటు చిత్తూరు, అటు అన్నమయ్య జిల్లాల్లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లొ పాల్గొంటున్నారు. ఇప్పుడు పుంగనూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో విలీనం అయితే కనుక ఒక్క అన్నమయ్య జిల్లాకు పరిమితం అవుతారు. పులిచెర్ల మండలం కారణంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని డీఆర్సీ, జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే పుంగనూరు టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న రామచంద్రారెడ్డి కూడా అన్నమయ్య జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది.

2022లో జగన్ సర్కార్ .. పార్లమెంట్ పరిధిని యూనిట్‌గా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. అయితే రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంలోని పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాత్రం చిత్తూరులో కొనసాగించడం విశేషం. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం కావడం కారణమని చర్చ జరిగింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఇటీవల పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేసేందుకు ప్రక్రియను చేపట్టింది. పులిచెర్ల మండలం గురించి క్లారిటీ రాగానే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేస్తుందని అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos