ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఫిర్యాదు దారుగా ఉన్న దళిత యువకుడు సత్యవర్ధన్ ను బెదిరించిన వ్యవహారంలో వంశీని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వల్లభనేని వంశీ వెన్నునొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో అతనికి వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది. లాయర్ సమక్షంలో వల్లభనేని వంశీని పోలీసులు విచారించనున్నారు. వంశీ కస్టడీ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా.. న్యాయస్థానం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీలో విచారించనున్నారు. కస్టడీ సమయంలో వంశీ లాయర్లు ఆయనతో రోజుకు మూడు సార్లు మాట్లాడేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే వల్లభనేని వంశీకి ఉదయం, సాయంత్రం వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించింది. వెస్ట్రన్ టాయిలెట్ సౌకర్యం కల్పించాలని, మంచం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సీఐడీ దూకుడు పెంచింది. వంశీ మోహన్‌పై అధికారులు పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 25న అంటే రేపు కోర్టులో హాజరు పరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos