ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వైసీపీ కూటమి ప్రభుత్వంపై కౌంటర్ గా కార్యాచరణ అమలు చేస్తోంది. ఎన్నికలు జరిగిన తరవాత 13 నెలలకే రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో... వెళ్లిన నేతలు కొందరు తిరిగి పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, తాజా గా ఇప్పుడు మాత్రం ఒక కీలక నేత పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కేంద్రంగా వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి తొలి నుంచి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు గెలవలేదు. కాగా, నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నికల ముందు ఆనం, కోటంరెడ్డి, వేమిరెడ్డి వంటి ముఖ్య నేతలు పార్టీ వీడారు. ఆ ముగ్గురు టీడీపీ నుంచి గెలుపొందారు. ఇక.. ఇప్పుడు మాజీ ఎంపీ.. నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీని వీడేందుకు సిద్దమైనట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన వైసీపీలో చేరారు. నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.

అయితే 2024 ఎన్నికల్లో తిరిగి ఎంపీగా పోటీ చేయాలని భావించినా.. ఎంపీగా సాయిరెడ్డిని పోటీకి దిగారు. నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాలని జగన్ సూచన మేరకు ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. కోటంరెడ్డి విజయం తరువాత ఆదాల రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. జిల్లా వైసీపీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు.. కేసులు.. వివాదాలు.. జిల్లా నేతల మధ్య కొరవడిన సమన్వయంతో ఆదాల మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో, ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీకి సిద్దంగా లేరని తెలుస్తోంది. రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఆదాల భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆదాలతో వైసీపీలోని ముఖ్య నేత తాజాగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు ఆదాల నిర్ణయం ఏంటనేది జిల్లా వైసీపీలో ఆసక్తికరంగా మారుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos