ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి హైకోర్టులో ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనను అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో మిథున్ రెడ్డికి కష్టాలు తప్పేలా లేవు. రాష్ట్రంలో కొత్త కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి దాదాపు 4 వేల కోట్ల మేర కుంభకోణానికి పాల్పడిన వ్యవహారంలో మిథున్ రెడ్డితో పాటు అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, మరికొందరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే సీఐడీ కేసు కూడా నమోదు చేసింది. అయితే ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
అయితే మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. మిథున్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చి చెప్పేసింది. ఈ మేరకు ఎంపీ మిథున్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను 24వ తేదీ సోమవారానికి వాయిదా వేసింది. దీంతో మిథున్ రెడ్డిని సీఐడీ అరెస్టు చేసేందుకు మార్గం సుగమం అయిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos