ఏపీ ప్రభుత్వం డీఎస్సీ నియామక ప్రక్రియ పైన మరో కీలక ప్రకటన చేసింది. మెగా డీఎస్సీలో మెరిట్‌ అభ్యర్థులకు ఇవాళ మంగళవారం కాల్‌ లెటర్లు విడుదల చేస్తామని డీఎస్సీ కన్వీనర్‌ కృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం కాల్‌ లెటర్లు అందుతాయని అభ్యర్థులు ఎదురుచూశారు. ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చినా రెండు జిల్లాల జాబితాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విడుదల ఆగిపోయింది. అదే విధంగా కాల్ లెటర్లు వచ్చిన అభ్యర్ధులకు కీలక సూచనలు చేసారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఏపీడీఎస్సీ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా వ్యక్తిగతంగా కూడా సమాచారం పంపనున్నారు. ఈ నెల 28న ఉదయం 9 గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందని కృష్ణారెడ్డి తెలిపారు. ఈలోగా అభ్యర్థులు ఏపీడీఎస్సీ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నారు. అదే విధంగా విద్యార్హతల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఇటీవల జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), అంగ వైకల్య ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), కాల్‌లెటర్‌లో పేర్కొన్న ఇతర సర్టిఫికెట్లు, గెజిటెడ్‌ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జిరాక్స్‌ కాపీలు, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పరిశీలనకు హాజరు కావాలన్నారు. కేటాయించిన తేదీ, సమయంలో తప్పనిసరిగా సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలన్నారు.

హాజరు కాని, అర్హత లేని వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారని, మెరిట్‌ జాబితాలోని తర్వాత అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారని వివరించారు. కాగా, సోమవారం కాల్‌ లెటర్లు అందుతాయని అభ్యర్థులు నిరీక్షించారు. అయితే... సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇక.. ఈ రోజు నుంచి ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos