వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం పైన కీలక అప్డేట్ అందుతోంది. నాని ఆరోగ్యంపై వైద్యులు కీలక అంశాలను వెల్లడించారు. నానికి గుండె శస్త్ర చికిత్స విజయవంతం అయింది. ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో చీఫ్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండే నేతృత్వంలో బైపాస్ సర్జరీ నిర్వహించారు. సర్జరీ తరువాత కొడాలి నాని క్రమేణ కోలుకుంటున్నారు. మాజీ సీఎం జగన్ వైద్యులతో మాట్లాడారు. గుండె ఆపరేషన్ తరువాత కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉంది. సర్జరీ తరువాత పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఐసీయూ నుంచి సాధారణ రూమ్ కు తరలించారు. కొడాలి నాని తిరిగి కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలోనే నెమ్మదిగా నడిపించినట్లు నాని కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. కొడాలి నానిని ఈ నెల 19 లేదా 20న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఏజీఐ లో చికిత్సలు కంటిన్యూ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొడాలి నాని కోలుకోవటంతో.. కొంతకాలం హైదరాబాద్ లోనే ఉండనున్నారు. వచ్చే నెల మరోసారి ముంబాయి ఆస్పత్రిలో చెకప్ కోసం వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది.
తాజాగా కొడాలి నాని డిశ్చార్జ్ సమాచారాన్ని వైద్యులు జగన్ కు అందించారు. దీంతో, కొడాలి నాని పరామర్శ కోసం మాజీ మంత్రి పేర్ని నాని ముంబాయి వెళ్లనున్నట్లు పార్టీ నేతల సమాచారం. నాని కోలుకున్నా.. కొంతకాలంగా పూర్తిగా రాజ కీయాలకు దూరంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. కాగా, నాని తిరిగి ఆరోగ్యంగా రావాలని ఆయన అభిమానులు.. పార్టీ కేడర్ పూజలు చేసింది. తొలుత హైదరాబాద్ లో నానికి వైద్య పరీక్ష లు చేసిన సమయంలో గుండెలో మూడు రక్త నాళాలు పూడుకుపోయినట్లు గుర్తించారు. బైపాస్ అవసరమని నిర్ధారించటంతో ప్రత్యేక విమానంలో ముంబాయికు తరలించిన విషయం తెలిసిందే.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos