ఏపీలోని టెట్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. ఏపీ విద్యాశాఖ ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2న అంటే ఈ రోజే టెట్ ఫ‌లితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ఫలితాలను నవంబర్ 4వ తేదీన ప్రకటించేందుకు రాష్ట్ర విద్యాశాఖ సిద్ధమైంది. మరోవైపు నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ కానున్న‌ట్లు స‌మాచారం. తుది కీ విడుదలలో జాప్యం జరగటంతో టెట్ ఫ‌లితాల‌ తేదీని మార్చినట్లు తెలుస్తోంది.

ఏపీ రాష్ట్రంలో టెట్ ప‌రీక్ష‌లు అక్టోబ‌ర్ 3వ తేదదీ నుండి అక్టోబ‌ర్ 21వ తేదీ వ‌ర‌కు జ‌రిగాయి. మొత్తం 17 రోజల పాటు ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. ప్రతి రోజు 2 షిప్టులుగా ప‌రీక్ష‌లు జ‌రిగాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్‌ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 3,68,661 మంది అభ్యర్థులు ఈ ప‌రీక్ష‌ల‌కు హాజరయ్యారు. వీరంతా కూడా టెట్ ఫలితాల కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఏపీ టెట్ రాసిన అభ్యర్థులు తుది కీ కోసం లేదా ఫ‌లితాల కోసం టెట్ అధికారిక వెబ్‌సైట్‌ను https://aptet.apcfss.in/ స‌ంప్ర‌దించ‌వచ్చు.

ఇదిలా ఉండ‌గా, రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ నవంబర్ 6వ తేదీన విడుదల కానుంది. ఈ మేరకు ఏపీ ప్ర‌భుత్వం కసరత్తు దాదాపు పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. నవంబర్ 6వ తేదీన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

మొత్తం పోస్టులలో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 6,371 ఉండ‌గా, స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725 పోస్టులు, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీలు)-1,781 పోస్టులు, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (పీజీటీలు)-286 పోస్టులు, ప్రిన్సిపాళ్లు 52 పోస్టులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధికారికంగా ఏపీ విద్యాశాఖ విడుదల చేసే నోటిఫికేషన్ ద్వారా ఖాళీలపై మరింత స్పష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos