ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మైక్రో సాఫ్ట్ ఫౌండర్, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ అమరావతిలో భేటీ అయ్యారు. బిల్‌గేట్స్ స్పెషల్ ఫ్లైట్‌లో ఇవాళ సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌లు స్వాగతం పలికారు. బిల్‌గేట్స్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా అమరావతిలోని సచివాలయానికి వెళ్లారు.. అక్కడ చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు బిల్‌గేట్స్ సమావేశం అయ్యారు.. పలు కీలక అంశాలపై చర్చించారు.

ఇద్దరి భేటీలో.. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల విస్తరణపై చర్చించారు. సంజీవని ప్రాజెక్టు కూడా చర్చకు వచ్చింది. అమరావతిలోని సచివాలయంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రాన్ని బిల్‌గేట్స్‌ పరిశీలించారు. ఆర్టీజీఎస్‌ విధానాలపై చంద్రబాబు గేట్స్‌కు వివరించారు. గేట్స్ టీమ్‌తో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. స్వర్ణాంధ్ర విజన్ 2047, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్యతో సహా ఆయా రంగాల్లో సంస్కరణలను వివరిస్తారు. గేట్స్ టీమ్ ఉండవల్లి దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రంలో పర్యటిస్తుంది.. అక్కడ సాగుకు సంబంధించిన విధానాలను టీమ్ పరిశీలించనుంది. డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టిన సాగు గురించి వివరించనున్నారు. కాగా 'మిస్టర్ బిల్‌గేట్స్‌.. అమరావతికి స్వాగతం.. ఈరోజు గన్నవరం విమానాశ్రయంలో గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్‌ను నా సహచర మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, సత్య కుమార్‌తో కలిసి స్వాగతించడం ఆనందంగా ఉంది. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతికత ఆధారిత పాలనలో భాగస్వామ్యాలను బలోపేతం చేయడంపై చర్చల కోసం అమరావతికి వెళ్లాము. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తోంది' అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.

మరోవైపు బిల్‌గేట్స్ ప్రయాణించిన విమానం ల్యాండింగ్‌కు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యాయి. పొగమంచు కారణంగా ల్యాండింగ్‌కు కుదరలేదు.. విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత క్లియరెన్స్ ఇవ్వడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విజయవాడ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. విమానాలకు సంబంధించి విజిబిలిటీకి ఇబ్బందులు ఎదురయ్యాయి.. అందుకే ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత వాతావరణం అనుకూలించడంతో విమానం ల్యాండ్ అయ్యింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos