ఏపీలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. ఏపీలో బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే పెద్దన్న పాత్ర పోషిస్తోంది. బీజేపీ నిర్ణయాలకు టీడీపీ, జనసేన అంగీకారం తెలపాల్సి వస్తోంది. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న నిర్ణయాల్లో బీజేపీ అనుకున్న విధంగానే ఏపీలో రాజకీయం చేస్తోంది. ఏపీలో బీజేపీకి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే, బీజేపీకి ఏపీ నుంచి ప్రస్తుతం రెండు రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం నామినేషన్ వేసిన అభ్యర్ధి ఎన్నిక సైతం ఏకగ్రీవం కానుంది. దీంతో, వ్యూహాత్మకంగానే బీజేపీ మిత్రపక్షాల నుంచి రాజ్యసభకు ఎంపిక అయ్యే అవకాశం ఇవ్వకుండా.. తమ అభ్యర్ధులనే ఖరారు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఎంపీ సీట్ల విషయంలో.. ఇప్పుడు రాజ్యసభ స్థానాల విషయంలోనూ బీజేపీ పట్టు జారటం లేదు.

బీజేపీ నుంచి జరుగుతున్న నియామకాలు టీడీపీ కేడర్ కు నచ్చటం లేదు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారికే ఇప్పుడు బీజేపీ ప్రాధాన్యత ఇస్తూ పదవులు కట్ట బెడుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన ఎమ్మెల్సీ స్థానం సోము వీర్రాజు, ఇప్పుడు రాజ్యసభ సీటు పాకా వెంకట సత్యనారాయణకు కేటాయించారు. ఈ నిర్ణయాల పైన సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల కోసం రెండు రాజ్యసభ సీట్లు.. అందునా, చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన వారికి అవకాశం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే.. బీజేపీ నేతలు మాత్రం పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన వారికి గుర్తింపుగా ఈ పదవులు ఇచ్చినట్లు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

బీజేపీ ఏపీ కేంద్రంగా పక్కా వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. అందులో భాగంగా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమయంలో సొంతంగా బలం పెంచుకోవాలని బీజేపీ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. అందులో భాగంగా టీడీపీ - జనసేన నేతలు నో అనలేని పరిస్థితి కల్పిస్తూ.. తమ నిర్ణయాలను అమలు చేస్తోంది. వైసీపీ నుంచి ఇప్పటి వరకు నలుగురు రాజ్యసభ సభ్యులు బయటకు రాగా.. అందులో రెండు స్థానాలు టీడీపీ.. మరో రెండు స్థానాలు బీజేపీకి దక్కేలా నిర్ణయాలు జరిగాయి. జనసేనకు ఒక్కటీ ఇవ్వలేదు. దీంతో, బీజేపీ రానున్న రోజుల్లో మరింత పక్కా వ్యూహాలతో పార్టీ భవిష్యత్ కోసం నిర్ణయాలు తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos