ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సతీసమేతంగా సోమవారం ఉదయం మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీని సందర్శించారు. ఈ ఉదయం సూర్యోదయానికి ముందు సాయిబాబా సన్నిధిలో భక్తిశ్రద్ధలతో నిర్వహించే అత్యంత విశిష్టమైన ‘కాకడ హారతి’ కార్యక్రమంలో లోకేశ్, బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు కోపర్‌గావ్ ఎమ్మెల్యే, సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ ఛైర్మన్ అశుతోష్ ఆకాశరావు కాలే, ఇతర అధికారులు సాదరంగా స్వాగతం పలికి బాబా వారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఈ పర్యటనలో మంత్రి లోకేశ్ వెంట చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా ఉన్నారు.  దర్శనం అనంతరం లోకేశ్ దంపతులు ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా క్రతువు ముగిసిన తర్వాత అర్చకులు వారికి బాబా వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలని కోరుకుంటూ మంత్రి ఈ పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది. లోకేశ్ వెంట పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఉన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలని సాయినాధుడిని ప్రార్థించినట్లు మంత్రి నారా లోకేష్ దంపతులు పేర్కొన్నారు. సాయిబాబా సన్నిధిలో ఆధ్యాత్మికంగా సమయం గడపడంపై దంపతులిద్దరూ ఆనందం వ్యక్తం చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos