వైసీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు నిన్ను గురువారం రాత్రి హైదరాబాద్ కు తరలించి, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయించారు kn FFF గా డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. బొత్స బ్రెయిన్ స్ట్రోక్ కు గురికావడం పార్టీలో తీవ్ర ఆందోళనకు దారి తీసింది.

ఆయన ఆరోగ్యంపై పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. కొద్దిరోజులుగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై శాసన మండలిలో చర్చ జరగాలంటూ ప్రతిపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ పట్టుబడుతూ వస్తున్నారు. దీనిపై వాయిదా తీర్మానాలను సైతం ఇచ్చారు. నేడు కూడా దీనిపై మండలిలో రచ్చ సాగింది. వైఎస్ఆర్సీపీకి చెందిన సభ్యులందరూ కూడా మండలిలోనే బైఠాయించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం, అందులో వినియోగించిన నెయ్యిని సరఫరా చేసిన ఇందాపూర్ సంస్థతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ తో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మండలిలో చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టుబట్టారు.

ఈ ఆరోపణల్లో ఇటు తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం, అటు వైఎస్ఆర్సీపీ నాయకులు పరస్పరం తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మండలిలో ప్రతిపక్ష పార్టీకి నాయకత్వాన్ని వహిస్తోన్న బొత్స సత్యనారాయణ వారిని ముందుండి నడిపిస్తున్నారు. నిత్యం వాదోపవాదాలు చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స హైబీపీకి గురయ్యారని, ఫలితంగా బ్రెయిన్ స్ట్రోక్ సంభవించినట్లు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. త్వరలోనే ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos