ఏపీకి భారీ పెట్టుబడి రానుంది. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం జరిగింది. రామాయపట్నంలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు నిర్ణయించింది. దశల వారీగా రూ.95,000ల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 6100 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి ముందస్తు కార్యకలాపాలు చేపట్టడానికి సంస్థ పాలకమండలి సమావేశం ఆమోద ముద్ర వేసింది. కొద్ది రోజులుగా ఈ పెట్టుబడి పైన చర్చ సాగుతుండగా.. ఇప్పుడు ఈ నిర్ణయం అమలు దిశగా నిర్ణయం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సుమారు లక్ష మందికి, పూర్తయిన తర్వాత 5000 మందికి శాశ్వత ఉపాధి లభించే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఏపీలో ముందుగా మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం ప్రాంతాలను పలు దఫాలు పరిశీలించింది. అవసరమైన భూములతో పాటుగా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని రామాయపట్నాన్ని అనువైన ప్రాంతంగా ఎంపిక చేసింది. నిర్మాణంలో ఉన్న రామాయపట్నం పోర్టులో రిఫైనరీ కోసం క్యాప్టివ్‌ విధానంలో బెర్త్‌ను కేటాయించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రాజెక్టు కోసం సుమారు 5000 ఎకరాలు అవసరమని సంస్థ ప్రతిపాదించింది.

ఆ మేరకు భూసేకరణకు సుమారు రూ.1500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ముందస్తు కార్యకలాపాలకు ప్రతిపాదించిన రూ.6100 కోట్లలో భూసేకరణ ఖర్చుపోను మిగిలిన రూ.4600 కోట్లను ఇతర అవసరాల కోసం వెచ్చిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సుమారు లక్ష మందికి, పూర్తైన తర్వాత 5000ల మందికి శాశ్వత ఉపాధి లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ ప్రాజెక్టు దక్కించుకునే వేళ ఏపీ కి గుజరాత్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురు కావడం గమనార్హం. ఎట్టకేలుకు పూజలు ప్రభుత్వ కృషితో ఈ ప్రాజెక్టు ఏపీకి దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos