తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా బీఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం భూవరాహ స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకున్నారు. ఆయనకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో గరుడాళ్వర్ సన్నిధి వద్ద టీటీడీ ఈవో శ్యామలరావు బీఆర్ నాయుడితో ప్రమాణం చేయించారు. టీటీడీ 54వ ఛైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం బీఆర్ నాయుడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈవో శ్యామలరావు బీఆర్ నాయుడు దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్ర పటాన్ని వారికి అందజేశారు. మరోవైపు ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదు నెలల తర్వాత టీటీడీ పాలక మండలి తిరుమలలో కొలువు తీరింది.
అలాగే 17 మంది సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పాలకమండలి కొత్త అధ్యక్షుడు బీఆర్ నాయుడు, 17 మంది సభ్యులు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో బాధ్యతలు స్వీకరించారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ కూడా బాధ్యతలు స్వీకరించారు. తొలుత చైర్మన్, అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకార పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో వారికి శేషవస్త్రాలు కప్పి వేద ఆశీర్వచనం చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos