ఏపీలో అమరావతి రాజధానికి మరో గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే ఐదేళ్లుగా నిలిచిపోయిన అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణం విడుదలకు హౌసింగ్ అండ్ అర్బన్ డెవపలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.

ముంబై లో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు అనుమతి లభించింది. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11 వేల కోట్లు రుణం కోసం సంప్రదింపులు జరిపామని,హడ్కో తాజా నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్ తో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంక్ కేంద్ర ప్రభుత్వ గ్యారంటీతో రూ.15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించాయి. రాజధానిలో పర్యటించిన ఆయా బ్యాంకుల ప్రతినిధులు స్దానికంగా ఉన్న పరిస్దితుల్ని, నిర్మాణం వల్ల కలిగే లాభాన్ని అంచనా వేసుకుని రుణాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. దీంతో మిగతా ఆర్ధిక సంస్ధలు కూడా ఇప్పుడు రాజధాని అమరావతికి క్యూ కడుతున్నాయి. మరోవైపు త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాజదాని నిర్మాణం పునఃప్రారంభించేందుకు కూటమి సర్కార్ ఏర్పాట్లు చేస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos