ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించిన తెలుగు క్రీడాకారులు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. సోమవారం నాడు ఎక్స్ వేదికగా ఆయన ఇద్దరు క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రశంసించారు. కోనేరు హంపిని ఉద్దేశించి చంద్రబాబు స్పందిస్తూ, "ఒక్క ఫలితంతో ఛాంపియన్లను అంచనా వేయలేం. అత్యున్నత స్థాయిలో పదేపదే పోటీపడే ధైర్యమే వారిని నిలబెడుతుంది. ప్రపంచ వేదికపై కాంస్యం సాధించడం మీ నైపుణ్యానికి నిదర్శనం. మీ ప్రయాణం, నిలకడ దేశంలోని లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుందని" పేర్కొన్నారు. అదేవిధంగా అర్జున్ ఎరిగైసిని కూడా ఆయన కొనియాడారు. "పురుషుల్లో గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా అర్జున్ నిలిచారు. తెలంగాణ బిడ్డ అయిన అర్జున్, భారత చెస్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేర్చారని"  చంద్రబాబు అన్నారు.

మరోవైపు, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, హోం మంత్రి అనిత, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఛైర్మన్ ఎ. రవి నాయుడు కూడా హంపికి శుభాకాంక్షలు తెలిపారు. హంపి ఇప్పటికే ఈ ఛాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు సాధించిందని, ఆమె మహిళా క్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా అర్జున్‌ను అభినందించారు. తెలంగాణ గడ్డకు గర్వకారణంగా నిలిచిన అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా హంపిని కూడా అభినందించిన బండి సంజయ్, ఆమె దేశం గర్వపడేలా చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos