ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని అధికార పీఠం నుంచి దించడానికి టిడిపి- జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీల మధ్య సీట్ల షేరింగ్ విషయంలో ఏర్పడ్డ గందరగోళం ఇప్పటికీ తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. రాజమండ్రి రూరల్‌ సీటు  తనదేనని  గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటుండగా... కాదు ఆ సీటు విషయమై తనకు పవన్‌ కల్యాణ్‌ మాట ఇచ్చారంటున్నారు జనసేన నేత కందుల దుర్గేష్‌. రాజమండ్రి రూరల్‌ అసెంబ్లీ సీటు టీడీపీ కంచుకోటల్లో ఒకటి. 2019 ఎన్నికల్లో జగన్‌ గాలి ప్రభంజనంగా వీచిన వేళ కూడా టీడీపీ నిలబెట్టుకున్న సీట్లలో రాజమండ్రి రూరల్‌ ఒకటి. ఇప్పుడు సడన్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేసిన క్రమంలో రాజమండ్రి రూరల్‌లో పోటీ చేసేది జనసేనా... లేక టీడీపీనా...  బరిలో నిలిచేది బుచ్చయ్యా... లేక దుర్గేషా.  అనే సందేహాలతో టీడీపీ కేడర్‌ సతమతమైపోతోంది. ఇక తన సిట్టింగ్‌ సీటును కాపాడుకునేందుకు చంద్రబాబును కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు బుచ్చయ్య.  పవన్‌ ఆల్రెడీ టీడీపీ అధిష్టానంతో మాట్లాడారని దుర్గేష్‌ చెప్పడం, సైకిల్‌ సైన్యంలో కలవరాన్ని పెంచుతోంది.  బుచ్చయ్య ట్వీటు తర్వాత సీటు ఫైటు మరింత వేడెక్కింది. ఇప్పుడు బుచ్చయ్య ముందున్న దారేంటి అనేదానిపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos