ఏపీలో ఈ ఏడాది అమలు చేయాల్సిన పథకాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. తాజాగా ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రంలో పాలనా పరమైన అంశాలపై మంత్రులతో మాట్లాడారు. ఇక విద్యార్థులకు అందించే తల్లికి వందనం పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలి అనేదానిపై కూలంకషంగా చర్చించి.. ముహూర్తం ఫిక్స్ చేశారు. తల్లికి వందనం పథకంతోపాటు రైతులకు అందించే అన్నదాత సుఖీభవ.. మత్స్యకారులకు హాలిడే సమయంలో అందించే ఆర్థిక సహాయంపైనా మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి ముచ్చటించారు. కొత్త ఏడాదిలో రాష్ట్రంలో అమలు చేయాల్సిన పథకాలకు సంబంధించి.. మంత్రివర్గ సమావేశం తర్వాత చర్చించారు.

ఏపీ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి  చంద్రబాబు  నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.  కేబినెట్ భేటీలో 14 అంశాలపై చర్చించిన మంత్రులు.. ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత పాలనా అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు కాసేపు మాట్లాడారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి "తల్లికి వందనం" పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ తల్లికి వందనం పథకం కింద.. అర్హులైన విద్యార్థులకు ఏటా రూ.15 వేలను ప్రభుత్వం చెల్లించనుంది. లబ్ధిదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న  తల్లికి వందనం పథకాన్ని... వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఏడాదికి రూ.15 వేలు ఇస్తారని మొదట ప్రచారం జరిగినా.. చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత క్లారిటీ ఇచ్చింది. ఇంట్లో ఎంత మంది చదువుకునే విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద.. ఏటా రూ.15 వేలు అందజేస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా రైతులు, మత్స్యకారులకు ఇచ్చే రూ.20 వేల ఆర్థిక సాయం పైనా మంత్రులతో సీఎం చంద్రబాబు మంత్రివర్గ భేటీలో చర్చించారు. రైతులకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ఇస్తున్న రూ.10 వేలకు.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు ఏటా రూ.20 వేలు అందనున్నాయి.

ఇక చేపలు పట్టి జీవితాన్ని సాగించే మత్స్యకారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ.20 వేలు చెల్లించే విషయంపైనా మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇక కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులపై ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos