సీఎం చంద్రబాబు నాయుడు  అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోలు కోసం రూ.700 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై కేబినెట్ అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

నాగావళి నదిపై గౌతు లచ్చన్న, తోటపల్లి బ్యారేజీపై కుడి, ఎడమ వైపు మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా కార్పొరేషన్‌కు కేటాయించిన 2595 ఎకరాల బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితాలో పెట్టిన దాదాపు 7లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించింది. ఆ భూములను ఏం చేయాలన్నదానిపై మంత్రుల కమిటీ ఏర్పాటు కు నిర్ణయించింది. కేబినెట్ భేటీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రతిపాదనపైన, రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటుపై చర్చించారు. అభ్యంతరాలు లేని స్థలాల రెగ్యులైజేషన్ పై చర్చించారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చించిన కేబినెట్ వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా, రైతు భరోసా పథకాల అమలుకు సిద్ధం కావాలని నిర్ణయించింది.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన 203 అన్న క్యాంటీన్ లకు తోడు మరో 62 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి పనులు వెంటనే ప్రారంభమవుతాయని కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం పీఎం కిసాన్ వేసిన వెంటనే ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. పోలవరం డయాఫ్రంవాల్ వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని చంద్ర చెప్పారు. పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభించి, నిర్దేశిత సమయం లోపు పూర్తి చేయాలని అన్నారు. ఇక, రాజధాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభం అవుతాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos