ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉర్సా క్లస్టర్ భూముల కేటాయింపు వ్యవహారం కలకలం రేపుతోంది. ఏపీ ప్రభుత్వం రూ. 3,000 కోట్ల విలువైన భూమిని చాలా తక్కువ ధరకు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు7 నెలల కిందట  అమెరికాలో ప్రారంభించిన ఈ ఉర్సా క్లస్టర్ కంపెనీకి 60 ఎకరాల భూమి ఎలా కేటాయించారనే ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే ఈ భూముల్ని దక్కించుకున్న ఉర్సా క్లస్టర్‌కు చెందిన ప్రమోటర్లు జూమ్ కాల్‌లో మాట్లాడి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాము ఏపీ ప్రభుత్వం నుంచి తీసుకున్న భూమి విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. తాము ఎకరా భూమిని 99 పైసలకు తీసుకోలేదని తెలిపారు. ఆ భూమిని మార్కెట్ ధరలకే తీసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తమది కొత్తగా రిజిస్టర్ అయిన కంపెనీ అయినా.. తమ టీమ్‌లో అనుభవజ్ఞులైన సభ్యులు ఉన్నారని చెప్పుకొచ్చారు.

ఈ ఉర్సా భూముల అంశంపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని టార్గెట్‌గా మాజీ ఎంపీ కేశినేని నాని విమర్శలు చేశారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ .. ఎంపీ చిన్ని బినామీ కంపెనీ అంటూ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు కేశినేని నాని. అలాగే కేశినేని చిన్ని కొన్ని అక్రమాలు చేస్తున్నారంటూ మరోసారి టార్గెట్ చేశారు. దీంతో విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. కేశినేని నాని ట్వీట్‌లకు తమ్ముడు కేశినేని చిన్ని ఘాటుగానే రిప్లై ఇచ్చారు. 'ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక.సోషల్ మీడియా రోడ్ల మీద మతిభ్రమించి తిరుగుతున్న సైకో.. .చిప్పు దొబ్బి సోషల్ వాల్స్ పై కసి,పగ, ద్వేషంతో రగిలిపోతూ విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్ముతున్న సైకో.స్పందించాల్సిన అవసరం లేదు. అప్రమత్తంగా ఉండండి' అంటూ చిన్ని కౌంటరిచ్చారు. అలాగే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కేశినేని చిన్ని కౌంటర్లు ఇస్తున్నారు.

తాజాగా మరోసారి కేశినేని నాని విజయవాడ ఎంపీ చిన్నిని టార్గెట్ చేశారు.. మరోసారి ఉర్సా భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. 'ఎవరు ఎన్ని జూమ్ మీటింగులు పెట్టి వివరణలు ఇచ్చినా నన్ను ఎవరు ఎన్ని బూతులు తిట్టినా చిప్ దొబ్బింది అన్నా.. సైకో అన్నా నో ప్రాబ్లెమ్ ఒకటైతే ఖాయం.. #URSAClusters..Vizag is for sale అంటూ మరోసారి ఆరోపణలు చేశారు. కేశినేని నాని తాజాగా చేసిన ట్వీట్‌కు చిన్ని ఎలా కౌంటరిస్తారో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

11-24-07-0807.jpg

రయ్యిమంటూ రాజధానిలోకి సీడ్‌ యాక్సెస్‌ ఇ3 రోడ్‌ ప్రారంభం 3 దశల్లో రూ.1519 కోట్లతో ఇ3 రహదారి నిర్మాణం
2026-08-13 Time: 11:24:07

Related Videos