ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పూర్తి బలం ఉన్నప్పటికీ టీడీపీకి మూడు మాత్రమే దక్కుతున్నాయి. మిత్రపక్షాలు అయిన జనసేన, బీజేపీకి చెరో స్థానం కేటాయించాల్సి వచ్చింది. జనసేన పార్టీకి కేటాయించే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రతీ సారి మాకేంటి అన్నట్లుగా తెరపైకి వస్తోంది. ఇప్పటికే ఆర్ కృష్ణయ్య విషయంలో రాజ్యసభ సీట్ తీసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సీటులోనూ వారే పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఓ ఎమ్మెల్సీ సీటునూ తీసుకున్నారు.

ఉన్న నాలుగు స్థానాల్లో టీడీపీ అధినాయకత్వం సామాజిక న్యాయం, ప్రాంతీయ న్యాయం, పార్టీకి చేసిన సేవల్ని బేరీజు వేసుకుని అభ్యర్థుల్ని ఖరారు చేశారు. ఫలితంగా సీటు హామీ పొందిన పిఠాపురం వర్మ , దేవినేని ఉమ సహా ఎంతోమందికి అవకాశాలు దక్కలేదు. భవిష్యత్ లో చాలా అవకాశాలు ఉంటాయి కానీ.. ఇప్పటికిప్పుడు తమకు ఎందుకు చాన్స్ రాలేదని వారు ఫీలయ్యే అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఇలా ప్రతి విషయంలోనూ బలవంతంగా తమ పదవులను తీసుకునే ప్రయత్నం చేయడం వారందరినీ ఇబ్బంది పెడుతోంది.

ఇప్పుడు బీజేపీకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇవ్వాల్సి వచ్చింది. చివరి క్షణం వరకూ బీజేపీ పేరు లేదు. కానీ పైస్థాయి నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు.. ఆ పార్టీకి ఎమ్మెల్సీ స్థానం కేటాయించారు. వచ్చే ఐదేళ్ల పాటు వైసీపీ తరపున ఖాళీ అయ్యే ప్రతి పదవి టీడీపీ కూటమికే వస్తుంది. ఆ పదవులతో పార్టీ నేతల ఆశలు తీర్చవచ్చు. కానీ అప్పటికీ బీజేపీ పోటీ రాదన్న గ్యారంటీ లేదు. కేంద్ర పదవుల్లో అయినా కొన్ని టీడీపీ నేతలకు కేటాయిస్తే కొంతమంది అసంతృప్తిని చల్లార్చినట్లవుతుంది. కానీ అలాంటి సహకారం బీజేపీ నుంచి లభించడం లేదని... ఇక్కడ టీడీపీనే త్యాగాలు చేయాల్సి వస్తోందని ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

18-01-10-0810.jpg

కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు..  అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 
2026-08-13 Time: 06:01:10

Related Videos