ప్రపంచం మారిపోతోంది. ప్రతీ రంగంలోనూ అధునాతన మార్పులు వచ్చేస్తున్నాయి. టూరిజం కూడా దానికి మినహాయింపు కాదు. టూరిస్టులు కూడా పర్యాటక రంగం లో మోడరన్ సౌకర్యాలు కోరుకుంటున్నారు. దాన్ని గమనించే ఏపీ ప్రభుత్వం టూరిజం క్యారవాన్ బస్సులను తెరపైకి తెచ్చింది. స్వయంగా ఏపీ సీయం చంద్రబాబు నాయుడు వాటిని ఇవాళ శుక్రవారం విజయవాడలో ప్రారంభించారు. తాను పర్యటనల్లో హోటల్లో స్టే చేయనని, క్యారవాన్ బస్సుల్లోనే విశ్రాంతి తీసుకుంటానని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.
ఇక ఈ బస్సుల స్పెషాలిటీ ఏమిటంటే...సింపుల్ గా చెప్పాలంటే మొబైల్ హాలీడ్ వెహికల్స్ అన్నమాట. సెలవుల్లో సరదాగా టూరిస్ట్ ప్లేస్ లు చుట్టి వచ్చేయాలనుకునే ఫ్యామిలీస్ కి ఇవి బెస్ట్ అప్షన్. వీటిలో ప్రయాణం ప్లస్ బస రెండింటి అప్షన్ ఉంటుంది. చాలా టూరిస్ట్ ప్లేసుల్లో స్టే కి సరైన సదుపాయాలు ఉండవు. అలాగే ప్రయాణాల్లో మహిళలు, చిన్న పిల్లలు వాష్ రూమ్ ల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలకు ఈ కార్వాన్ బస్సులు బెస్ట్ ఆప్షన్..వీటిలో బెడ్లు, చిన్న కిచెన్ దానిలో స్టవ్, రిఫ్రిజిరేటర్, వాష్ రూమ్, కుర్చీలు, టేబుల్, AC, వైఫై, టీవీ వంటి సౌకర్యాలు ఉంటాయి. దీన్ని కదిలే హోటల్ రూమ్ అని చెప్పుకోవచ్చు.
ప్రభుత్వం ఈ క్యారవాన్ బస్ టూరిజంపై ఎందుకు దృష్టి పెడుతోందంటే... ఏపీ లాంటి రాష్ట్రాల్లో నిజమైన ప్రకృతి అందాలను వీక్షించేందుకు అడవులు, కొండలు, బీచ్ లు లాంటి ఏరియాల్లోకి వెళ్ళాలి. అలాంటి చోట్ల శాశ్వత టూరిజం ఏర్పాట్లు, హోటళ్లు రెడీ చేయడం వల్ల అక్కడ ప్రకృతి దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అదే క్యారవాన్ ల తో ఆ ప్రాబ్లమ్ ఉండదు. అదేవిధంగా కోవిడ్ తర్వాత ఎక్కువమంది పర్యాటకులు సేఫ్టీ, ఫిజికల్ డిస్టెన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వారు ఫ్యామిలీ సమేతం గా వెళ్ళడానికి ఈ రకం బస్సులు చాలా బెటర్ అని అభిప్రాయపడుతున్నారు.
ఈ క్యారవాన్ బస్సుల టూరిజాన్ని ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాస్ట్రాలు ఎడాప్ట్ చేసుకున్నాయి. ఇప్పుడు వాటిలో ఏపీ కూడా చేరింది. విజయవాడ లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ క్యారవాన్ బస్సులను ప్రారంచించగా.. దీన్ని ఏపీ టూరిజం డెవలప్ మెంట్ లో గేమ్ చేంజింగ్ ఈవెంట్ గా ఏపీ టూరిజం మినిష్టర్ కందుల దుర్గేష్ అన్నారు. త్వరలోనే వీటి బుకింగ్, రేట్స్ లాంటి వివరాలపై స్పష్టత ఇవ్వనున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos